YOGA MAHABHAGYAM by GOTTI MUKKALA MURALIKRISHNA Telugu book cover

YOGA MAHABHAGYAM

by GOTTI MUKKALA MURALIKRISHNA

₹30
In stock · 4 available
PublisherGOTTI MUKKALA MURALIKRISHNA
LanguageTelugu
యోగ - పరిచయము యోగ అనునది ఒక అధ్యాత్మిక క్రమశిక్షణ, శరీరం, మనసుల మధ్య అనుసంధానం ఏర్పరచే ఒక మహత్తర అదృశ్య వైజ్ఞానిక శాస్త్రం. ఉన్నత జీవన విధాన శైలి. యోగ అను పదం సంస్కృత మూలపదమైన "యుజ్" నుండి ఉద్భవించింది. యుజ్ అంటే కలవడం, ఐక్యం కావడం, సమ్మిళితం కావడం. యోగ ఆనునది మన చేతనావస్థను నిత్య చేతనావస్థతో కలవడానికి దోహదపడుతుంది. యోగ మన జీవన ప్రయాణం లోని ప్రతి సందర్భాన్ని ప్రభావితం చేస్తూ, అడ్డంకులను అధిగమించేలా చేస్తూ, ఆరోగ్య, ఆనందాలను కలగజేస్తూ ముందుకు తీసుకుపోతుంది. యోగచరిత్ర, యోగ ఆవిర్భావము... యోగ ఇప్పటికిప్పుడు పుట్టినదేమీ కాదు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన భారతదేశ మహనీయులు, మహర్షులు ఎంతో మంది ఆచరించారు. అంతే కాకుండా ప్రపంచ నలుమూలలో కూడా యోగ వెలుగులు ఉన్నాయని మనకు చరిత్ర, ప్రాచీన నాగరికతలు తెలియజేస్తున్నాయి. భారతదేశంలో యోగవిధానముల అభివృద్ధి పరిపూర్ణస్థితికి చేరు కోబడ్డాయి. అగస్త్య మహాముని యోగను భరతఖండం అంతటా విస్తరింపజేశారు. పతంజలి మహర్షి నేటి సమజానికి పతంజలి యోగ సూత్రాల రూపంలో క్రోడీకరించి అందించారు. ఇక చారిత్రక ఆధారాలకు వస్తే క్రీస్తుపూర్వం 5వ శతాబ్ధానికి ముందు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం ప్రాంతంలో మౌనమూర్తి చిత్రలేఖనాలు బొమ్మల రూపంలో 'యోగను ఆచరించిన ఆనవాలు కనబడ్డాయి యోగ మహాభాగ్యం గొట్టెముక్కల మురళీకృష్ణ 7