YOGA RAMAYANAM by BHAMIDIPATI BALATRIPURA SUNDARI Telugu book cover

YOGA RAMAYANAM

by BHAMIDIPATI BALATRIPURA SUNDARI

₹75
In stock · 10 available
PublisherSRI SHANMUKHESWARI PRACHURANALU
LanguageTelugu
ముందుమాట యోగాప్రియులకి నమస్కారం! ఈ రోజుల్లో యోగా మీదా అందరికీ ఇష్టం ఏర్పడింది. ఇష్టం అనే కంటే యో యొక్క అవసరం ఏర్పడింది అనవచ్చు. ప్రస్తుతం సమాజంలో కమ్ముకుని వస్తున్న అనే విధాలైన వ్యాధులు భయపెడుతున్నాయి. వాటినుంచి ఎలా రక్షించుకోవాలో తెలియ అయోమయ పరిస్థితిని ఎదుర్కుంటున్నాం. మొలకెత్తిన గింజలు తినడం, అదే పని . నడవడం, గుప్పిళ్లనిండా మందుబిళ్లలు మింగడం, దేన్ని తినచ్చు దేన్ని తినకూడ తెలియని పరిస్థితి, వైద్యుల చుట్టూ తిరిగినా తగ్గక ఎవరు ఏది చెబితే అది చేసేస్తున్నా రోగాలు వచ్చాక తగ్గడం అనేది భ్రమ. పెరగకుండా చూసుకోవడమో వాటిని భరిణ శక్తి కావాలని భగవంతుణ్ని కోరడమో లేదా ఆ బాధలకి అలవాటు పడిపోవడమో తప మన పూర్వీకులు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మనకు ప్రాణాయామం, యో అనే వాటి గురించి కొన్నివేల సంవత్సరాలకి పూర్వమే చెప్పారు. ప్రాచీన మహర్షు ప్రాణాయామం చేసి వేల వేల సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు. యోగా, ప్రాణాయామ పద్ధతుల్ని అనుసరించడం వల్ల వ్యాధులబారిన పడకుడా ఎవర్ని వాళ్లు రక్షించుకోవచ్చు. ఇప్పుడు మనకు వ్యాయామమూ లేదు, ఆహార జాగ్రత్తల అసలే లేవు. మంచి నడవడిక, పద్ధతులు లేవు. అసలు క్రమశిక్షణే లేదు. అందుమా వ్యాధులన్నీ కొత్త కొత్త పేర్లతో చుట్టుముడుతున్నాయి. పురాణ కాలంలోనే ఆంజనేయుడికి యోగము ఎన్నిరకాలు, ప్రాణాయామం పద్ధతులు, మంత్రము, మంత్రజపము, ధ్యాన పద్ధతి, మంత్రయోగము, ఆహా నియమాలు, యోగాభ్యాసము, అనువైన ప్రదేశము, ఇంద్రియాలను అరికట్టడం, శర్ నిర్మాణము వంటివన్నీ యోగాద్వారా వివరంగా సీతాదేవి తెలియచేసింది. ఆంజనేయుడి ఆమె చెప్పినదాన్ని క్రమపద్ధతిలో ఆచరించి ఇప్పటికీ ఆరోగ్యంగాను, బలంగాను ఉత్సహంగాను, చిరంజీవిగా ఉన్నాడు. తారకయోగం గురించి సీతాదేవి చెప్తే... ఆంజనేయుడికి శ్రీరాముడు సాంఖ్య యోగము అమనస్కయోగము గురించి చెప్పాడు. గురువులు చెప్తుండగానే అచరణలో పెట్టి ఆంజనేయుడు ఆరోగ్యంతో పాటు పరమాత్మ దర్శనం పొంది జీవన్ముక్తుయ్యాడు. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత మనకి గొప్ప జ్ఞానా ప్రసాదిస్తున్నాయి. మనం వాటివైపు చూడం.