YOGA SADHANA by DR.YOGASRI Telugu book cover

YOGA SADHANA

by DR.YOGASRI

₹200
In stock · 2 available
PublisherDR.YOGASRI
LanguageTelugu
యోగము - బహు జన్మార్జిత సుకృతం యోగావతరణ అనాదిగా భారతదేశం యోగభూమి. యోగాలకు పుట్టినిల్లు. అనేక మంది యోగులకు, వామలకు, సర్వజ్ఞలకు జన్మనిచ్చిన భూమి. ఇట్టి పవిత్ర భరత ఖండమున ఎంతో మంది యోగులు పునీతులైరి. వారి సాధనలచే ఈనాడు మనదేశం ప్రపంచ దేశాలలో ధార్మిక యోగరంగమున ఉన్నతమైన పవిత్ర స్థానమును పొందియున్నది. యోగము అన్న శబ్దము అతి పురాతనమైనది. అనాది యైనది. నాశరహిత పరమార్థ సాధన, యోగ జయంతి ఎప్పుడు జరిగింది, యోగావతరణ ఎప్పుడు జరిగింది, దానికి కావలసిన గ్రంధాధారములు లేవు. గ్రంధ ప్రమాణము లేదు. కాని అతి సనాతన సాధనా పద్దతి. అనాదిలో సత్య యుగమందు అవతరించినదియే యోగము. ఆదిలో దేవ మతమైన సనాతన ధర్మము ఒకనాటి సత్యయుగములో ఉండేది. దానికే సత్యయుగమని పేరు. అపుడు యోగమునకు ఆవిష్కరణ జరిగింది. అట్టి మహోన్నతమైన యుగమున సృష్టికర్త, దేవతలు మరియు మహా ఋషులు అనుష్ఠించిన మార్గమే సత్యయోగం. అప్పటి నుండి ఇంతవరకు యోగ శబ్దము గంగా ప్రవాహము వలె ప్రవహిస్తూ కలియుగమున మనకు సంక్రమించినది. యోగము యొక్క పురాతన తత్త్యాన్ని శ్రీకృష్ణుడు గీతయందు ప్రస్తావించి యున్నారు. వారి బోధనల ద్వారా యోగము ఎప్పుడు ఆవిర్భవించినదనుటకు మనకు కొంత ఆధారము లభించుచున్నది. అనాది కాలములో తాను యోగ రహస్యమును గురించి సూర్యునికి చెప్పియున్నారు. మార్యుడు తిరిగి తన కొడుకు మనువుకు చెప్పియున్నారు. అతడు తన కొడుకు ఇక్ష్వాకువుకు బోధించిరి. తరువాత యోగ విద్య కాలక్రమమున, వంశక్రమాను గతంగా రాజులకు లభించినది. తరువాత విశేష కాలాతి క్రమము చేత మరుగున పడిపోయినది. యోగాన్ని గురించి వేదములు, ఉపనిషత్తులు, గీత, శ్రీయోగవాసిష్ఠము, పతంజలి యోగ సూత్రములు, స్మృతులు, శ్రుతులు, పురాణాలు, ఇతిహాసములు, మరి ఇతర గ్రంధములు దీని ఔన్నత్యమును, ప్రభావమును ఉపదేశించినవి. మార్కండేయ, విష్ణు పురాణములలోను, భారత, రామాయణ, భాగవతాదులలోను ప్రస్తావనా పూర్వకముగా కలదు. ఈ విధముగా యోగము పరంపరా గతమైనది.