YOGA VASISHTA KATHALAHARI by DR.DHARA RAMANADHA SASTRY Telugu book cover

YOGA VASISHTA KATHALAHARI

by DR.DHARA RAMANADHA SASTRY

₹50
In stock · 11 available
PublisherDR.DHARA RAMANADHA SASTRY
LanguageTelugu
యోగ వాసిష్ఠ కథాలహరి అవతారిక ఆనాడు అయోధ్యానగరం యావత్తూ సంచలనంతో, ఉద్వేగంతో, ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నది. నగర వీధులు, రథ్యలు, కాలిబాటలు అన్నీ సర్వాలంకార శోభితములై ఒక మహర్షికి, ఒక మంత్ర ద్రష్టకు, ఒక బ్రాహ్మక్షాత్ర తేజోమూర్తికి స్వాగత సన్నాహాలు చేయడానికి సర్వసంసిద్ధ స్థితిలో ఉన్నవేళ హుటాహుటి విశ్వామిత్రులు ప్రవేశించారు. శిష్య సహితులై వేంచేసిన ఆయనకి ఎదురేగి నమస్కరించి అర్ఘ్యపాద్యాదికం ప్రారంభంగా రాజోపచార, భక్త్యుపచార, శక్త్యుపచారాలు సమర్పించి తాను స్వయముగా వింజామర చేబూని వీస్తూ నిలువబడిన దశరథ చక్రవర్తి, ఆయన రాణులు, ఒకవైపు వసిష్ఠులవారు, ఇతర మునీంద్ర వేదవిద్బృందము మరోవైపు అధివసించియున్న ఆ దశరథేశ్వర సభాభవనం సాక్షాత్తు దేవేంద్ర సభాసదృశమై భాసిస్తున్నది. అప్పటికే ప్రాణాలు అరచేత బట్టుకొని ముఖంమీద చెమట బొట్టులను తుడుచుకుంటూ వినయంతో వంగి చేతులు కట్టుకొని యున్న దశరథ చక్రవర్తి మెల్లగా గొంతు సవరించుకొని గాద్గదికం వ్యక్తంకాగా అన్నాడు. మహర్షుల రాకచే నా మందిరం పావనమైనది. మా జన్మ ధన్యమైనది. ఇన్నేళ్ళ మా పుణ్యం పంటకి వచ్చి మిమ్ము సేవించుకొనే మహాభాగ్యం లభించింది. ఆజ్ఞాపించండి మహర్షీ! మీ ఆన మేరకు ధనకనక వస్తు వాహనాలు సమర్పించనా, నిధి నిక్షేపాలు తరలించనా, యజ్ఞయాగాది క్రతువులాచరించి విశ్వ సంక్షేమాన్ని పొందించనా, ఇన్ని మాటలెందుకు మునీంద్రా, మా సర్వస్వం మీ పాదపీఠం దగ్గర సమర్పిస్తున్నాను.