
YOGA VASISHTAM
₹40
In stock · 15 available
PublisherV.V.RAMANA RAO
LanguageTelugu
ఈ సృష్టిలో నియతి ఎవరు ఏర్పరచారు. సూర్య చంద్రాదులు ఆ నియతి తప్పకుండా ఎలా ప్రభవిస్తున్నారు? నక్షత్ర మండలం ఎలా ఉనికిని పొందుతూంది? ఇది అగ్ని, ఊర్థ ముఖంగా ప్రజ్వరిల్లునుగాక, ఇది జలము. ఇది పల్లమునకు ప్రవహించునుగాక, అనెడి ధర్మాలను వాటికి ఎవరు నిర్ణయించారు? పుష్పాలకి సౌరభం ఎవరు కల్పించారు” వృక్షాలకి ఫలాలనిమ్మని ఎవరు ఆదేశించారు? అదే బ్రహ్మము ఈ సృష్టిలో కనబడే మాయా విలాసము కంతటికీ ఆ బ్రహ్మమే కారణము సృష్టిలో సర్వులకూ వాస్తవ రూపం అదే. ఆ బ్రహ్మము మాయా విలాసము వల్లనే ఈ జగత్తు అనబడే దృశ్యము ఏర్పడుతూంది. ఈ సృష్టి అంతా మిధ్య, బ్రహ్మము లేదా శుద్ధ చైతన్యము కల్పించిన మాయయే. ఆ మాయను ఛేదిస్తేగాని, జీవునికి మోక్షం కలగదు