YOGA VIJAYAM - 75 by GOTTI MUKKALA MURALIKRISHNA Telugu book cover

YOGA VIJAYAM - 75

by GOTTI MUKKALA MURALIKRISHNA

₹75
In stock · 3 available
PublisherGOTTI MUKKALA MURALIKRISHNA
LanguageTelugu
తొలిమాట ప్రస్తుత సమాజంలో విధ్యార్థులను మొదలుకొని, తల్లిదండ్రులు, వ్యాపారస్థులు, ఉద్యోగస్థులు, వ్యవసాయదారులు, సాఫ్ట్వేర్ రంగ పరిశ్రమల ఒకరేమిటి ప్రతి ఒక్కరూ ఎదుర్కుంటున్న పెద్ద సమస్య ఒత్తిడి. ఇలా అన్ని వర్గాల వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు, దీన్ని తట్టుకొనే ఓర్పు, ఏకాగ్రతలు పెంచుకోవడానికి మన యోగ నిపుణుడు మురళీకృష్ణ ఎన్నో పరిశోదనాత్మక, పరిశీలనాత్మక క్రతువులు జరిపి అందరు ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యము కలిగి జీవితంలో ప్రతి దశలోను విజయము పొందడానికి ఈ "యోగ విజయం" పుస్తకాన్ని అందించారు. ఈ ఒత్తిడి వలన కలిగే బి.పి, డయాబెటిస్, క్యాన్సర్, గుండె వ్యాధులను సంపూర్ణంగా నివారించడానికి యోగలో గల లోతైన శిక్షణ విధానాలు, ఆచరణ పద్ధతులు, ఒత్తిడి నిర్వహణ పద్ధతులలో దాని సమాకలనం (Integration) ఉపయోగించి వ్యాధిరహిత సమాజ నిర్మాణానికి ఆదిత్య యోగ రిసెర్చసెంటర్ థెరఫిస్ట్ మురళీకృష్ణ వారి కృషి పలితమే ఈ “యోగ విజయం". యోగ ప్రారంభించిన వెంటనే మన మెడికల్ ఖర్చులు ఆగిపోతాయి. దీర్ఘకాలిక భయంకరమైన వ్యాధులు బి.పి. డయాబెటిస్, గుండె వ్యాధులు, కాన్సర్, పెరాలసిస్ వంటివి తగ్గి నయమవుతాయి. కంటికి సంభంధించిన వ్యాధులు కూడా పూర్తిగా నయమవుతాయి.. విద్యార్థులు, వ్యాపార వాణిజ్య, కార్పోరేట్ వర్గాల వారు, పరిశ్రమ ఉద్యోగస్థులు మిగిలిన అందరూ యోగను పాటించి వారి తీవ్ర ఓత్తిడిని తగ్గించుకోవడానికి ఇది మంచి సమయం, వెంటనే యోగను ప్రారంభిద్దాం, ఆరోగ్యంగా ఉండి జీవితంలోని ప్రతి దశలో ఆనందోత్సాహాలతో ముందుకు వెళదాము.