YOGA YAGNAVALKYA SAMHITHA by DEVARAKONDA SESHAGIRI RAO Telugu book cover

YOGA YAGNAVALKYA SAMHITHA

by DEVARAKONDA SESHAGIRI RAO

₹75
In stock · 7 available
PublisherVIGNANA MANJOOSHA
LanguageTelugu
ప్రథమోధ్యాయః. 1. యాజ్ఞవల్క్యం ఋషిశ్రేష్ఠం సర్వజ్ఞం జ్ఞాననిర్మలం సర్వశాస్త్రార్థ తత్త్వజ్ఞం సదా ధ్యానపరాయణం యాజ్ఞవల్క్యుడు ఋషిశ్రేష్ఠుడు. సర్వశాస్త్రాలను అభ్యసించినవాడు. తత్త్వవేత్త, ఎల్లపుడూ ధ్యానపరుడై యుంటాడు. 2. వేదవేదాంత తత్త్వజ్ఞం యోగేషు పరినిష్ఠితం జితేంద్రియం జితక్రోధం మితాహారం జితశ్రమం వేదవేదాంగాలలో పారగంతుడై యోగనిష్టుడై యుంటాడు. అతడన్ని ఇంద్రియాలను జయించినవాడు. క్రోధాన్ని అదుపులో పెట్టినవాడు. మితాహారుడు. అలసట లేనివాడు. 3. తపస్వినం జితామిత్రం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియం తపోవనగతం సౌమ్యం సంధ్యోపాసన తత్పరం అతడు తపస్వి. అందరితో మిత్రత్వంతో ఉంటాడు. వేదవేత్తలంటే ఇష్టపడేవాడు. నియమ నిష్ఠుడై, తపోవనగతుడై, సౌమ్యుడై, సంధ్యోపాసన తత్పరుడై యుంటాడు. 4. బ్రహ్మవిద్భిర్మహాభాగైః బ్రాహ్మణైశ్చ సమావృతం సర్వభూతసమం శాంతం సత్యసంధం గతక్లమం బ్రహ్మవేత్తల మధ్యలో ఉండేవాడు. సర్వభూతాల పట్ల బ్రహ్మభావనతో (సమం) ఉండేవాడు. శాంతుడు. సత్యసంధుడు. అలసట లేనివాడు.