
YOGABHYASA RAHASYALU
₹60
In stock · 7 available
PublisherM.SATYANARAYANA
LanguageTelugu
ఓం అవిఘ్నమస్తు శ్రీ రామలాల్ పరబ్రహ్మణేనమః యోగాభ్యాస రహస్యాలు ప్రథమ ప్రకరణము యోగ శబ్దానికి అర్థాలనేకమున్నాయి. కలయిక, ఉపాయము, ధ్యానము, ఇంద్రియనిగ్రహము, ఐక్యానుసంధానము, దేహస్థైర్యము, రాజయోగము, హఠయోగము, మొదలైనవి. ఇవి సందర్భానుసారముగా ఇందు అన్వయించబడును. జీవ బ్రహ్మల ఐక్యము, దానికి సాధనోపాయాలు, రచనాంశము. శక్తి శక్తిని సృష్టించలేము. నాశనము చేయలేము. శక్తి ద్రవ్యముగా, ద్రవ్యం శక్తిగా, రూపాంతరము పొందుతుంటుంది. దానికి పెరుగుదల, తరుగుదల లేదు. విశ్వమందున్న శక్తి మొత్తము మారని ఏకాంకమని శాస్త్రజ్ఞుల ఏకైకాభిప్రాయము. వ్యక్తి లేకుండ శక్తి వ్యక్తంకాదు. శక్తి లేక వ్యక్తి వ్యవహరించలేడు. కార్యరూపంలోకాని శక్తి ప్రకటంకాదు. ప్రకటమయ్యేశక్తి కార్యవైవిధ్యాన్ని బట్టి మారుతుంటుంది. శక్తికి మించిన పనిని ఏ వ్యక్తీ చేయలేడు. వ్యక్తి యందున్న శక్తి పరిమితము. వ్యక్తులందరియందు శక్తి ఒకే పరిమాణంలో ఉండదు.