
YOGALAYA - SPIRIT OF YOGA
₹100
In stock · 8 available
PublisherYOGALAYA RESEARCH CENTRE
LanguageTelugu
స్వతంత్రజీవనమే యోగజీవనం యోగలయ యోగలయల సమాహారం యోగజీవనం అయినప్పుడు ఈ యోగజీవన అంతస్సూత్రం ఏమిటి? బ్రహ్మేచ్ఛ, స్వతంత్రేచ్ఛ, సాధనేచ్ఛ - ఈ మూడింటి సమ్మేళనమే యోగజీవనం. ఈ మూడు యోగజీవన అంతర్లయలు. మన సాధనకు స్వతంత్రేచ్ఛ, సాధనేచ్ఛలు నేత్రద్వయాలయితే బ్రహ్మేచ్ఛ త్రినేత్రం అవుతుంది. పైకి కనిపించేవి స్వతంత్రేచ్ఛ, సాధనేచ్ఛలే అయినప్పటికీ కనిపించకుండా పరితపించేది బ్రహ్మేచ్ఛ గురించే. స్వతంత్రేచ్ఛ, సాధనేచ్చలతో బ్రహ్మేచ్చ ఐక్యమయితేనే యోగజీవనం పరిపూర్ణమయ్యేది. బ్రహ్మం అంటే బ్రహ్మత్వం ... ఆ బ్రహ్మత్వాన్ని మన మానవత్వంలో లయింప చేసుకోవాలనే సంకల్పంతో స్వతంత్రించటమే బ్రహ్మేచ్చ. ఇక్కడ స్వతంత్రించటం అంటే స్వతంత్రసాధన. ఇక బ్రహ్మతత్వమూ మన మానవతత్వమూ వేరువేరు కాదన్న తెలివిడికి రావటం బ్రహ్మేచ్ఛ ఫలితాలు. జీవితాన్ని తోలుబొమ్మలాటలా సాగించక, అంటే మన జీవితాన్ని నియంత్రించే అధికారాన్ని ఎవరికో అప్పజెప్పక మనకు మనంగా మన ఇచ్చానుసారం క్రమశిక్షణతో సంపూర్ణంగా స్వతంత్రజీవనం సాగించటం స్వతంత్రేచ్ఛ ఫలితం. అటు బ్రహ్మత్వ జిజ్ఞాస, ఇటు స్వతంత్రజీవన లాలస మన జీవితాల్ని, మన మనసుల్ని తొలుస్తుంటే ఒక తృష్ణ బయలుదేరి అది సాధనేచ్ఛగా పరిణామం చెందుతుంది. నిరంతర సాధనే బ్రహ్మత్వాన్నీ, మనలనూ సంధానపరుస్తుంది. ఆ నిరంతర సాధన వల్లే బ్రహ్మతత్వమూ మనమూ ఒకటే అన్న స్పృహ కలుగుతుంది. ఇదే సాధనేచ్ఛ ఫలితం. ఎప్పుడైతే మనకు మనంగా సాధనావశ్యకతను గుర్తిస్తామో అప్పుడే పూజలు, పునస్కారాల వల్ల పెద్దగా ఫలితం లేదన్న తెలివిడీ కలుగుతుంది. ఉపవాసం ముఖ్యం కాదు ఉపదేశం ప్రధానం అన్న స్పృహ ఫలితంగా ఆధ్యాత్మిక చింతన అంటే వేదాంత గ్రంథాల పఠనం కాదు, యోగసాధన ముఖ్యం అన్న చైతన్యం కలుగుతుంది. ఈ చేతనా పరిణామమే యోగజీవనం. మనసా, వాచా, కర్మణా అంటామే- ఈ త్రికరణశుద్ది వల్ల జీవితం కల్మషరహితం అయినట్లుగానే బ్రహ్మేచ్ఛ, స్వతంత్రేచ్ఛ, సాధనేచ్ఛ అనే త్రిఇచ్ఛా సంపుటితో కల్మష రహితమైన జీవితం యోగజీవనంగా పరిణమిస్తుంది. ఈ యోగజీవనం స్త్రీ-పురుష సంగమం. అంటే సృష్టికి ప్రతిసృష్టి చేయగల శక్తిపాత విలాసం. ఈ విలాసానికి నివాసం స్త్రీ పురుషుల భౌతికరూపాలే అయినా యోగలయ డా॥ వాసిలి వసంతకుమార్