
YOGAMAYAM JANAPADULA JEEVANA VIDHANAM
by DR.ANIREDDY SASIREKHA PULLAREDDY
₹250
In stock · 28 available
PublisherJAYANTHI PUBLICATIONS
LanguageTelugu
ప్రవేశిక భారతదేశం ఒక యోగభూమి... సంపూర్ణ విశ్వమానవులకు కూడ ఉపయోగకరమైన జీవితంలో అనిర్వచనీయ ఆనందానికి, ఆత్మజ్ఞానానికి అద్భుతమైన మార్గం చూపే శక్తి యోగంలో ఉంది. ఒక యోగాభ్యాసకుడు స్వహితంతో పాటు సమాజ హితం మరియు లోక కళ్యాణానికి ఆతని యోగవిద్యను ఉపయోగించగలుగుతాడు. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నియో అలజడులు, ఆందోళనలు వివిధ ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయి. లోకంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని రోగాలున్నా వాటన్నింటికి 'యోగ'లో పరిష్కారాలు పుష్కలంగా ఉంటాయి. వేదవాఙ్మయంలో యోగం గురించి పలు సందర్భాల్లో ప్రస్తావన లున్నాయి. మొట్టమొదటిసారిగా హిరణ్యగర్భుడు (బ్రహ్మదేవుడు) మహోన్నత యోగవిద్యకు రూపకల్పన చేశాడు. యోగమాయ ఒక దేవత, జీవనదాయిని సుధ- అమృతం లాంటిది. 'ఓంకారం' అనగా ప్రణవాక్షరాల యందున్న 'అకారము, ఉకారము, మకారములు' శాశ్వతమైనవి. తానే మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహాదేవి మరియు మహాసూరి యని గుర్తింపబడుతుంది. ఈ యోగమాయ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు జన్మనిచ్చి వారికి శరీరధారణ జరిగేలా చేసినది. ఈ దివ్యమైన యోగవిద్య శంకర భగవానునిచే కూడ నిర్మించబడినది. అందుకని శివుని యోగీశ్వరుడంటారు. పార్వతీదేవి కూడ శివునిచే చేయబడిన సుదీర్ఘమైన యోగోపదేశాన్ని పొందినది. శ్రీకృష్ణుడు 'యోగేశ్వరుడు' అనబడుతాడు. మహాభారత మహాకావ్యాన్ని రచించిన వేదవ్యాస ముని 'భగవద్గీత'లో శ్రీకృష్ణుని ద్వారా చేయబడిన యోగమహోపదేశం విశ్వవ్యాప్తిని పొందినది. వేదోపనిషత్తుల పర్యవసానం ఈ అష్టాధ్యాయి 'గీత' లోనే ఉన్నది అని పండితుల వచనం. ఓంకార మహిమ :- ఓమిత్యేకాక్షర ధ్యానాత్ విష్ణుర్విష్ణుత్వమా ప్తవాన్ బ్రహ్మా బ్రహ్మత్వమాపన్న; శివతామ భవత్ శివః ॥ ఓంకార ధ్యానం వల్ల విష్ణువు విష్ణుత్వమును, బ్రహ్మ బ్రహ్మత్వమును, శివుడు శివత్వమును పొందారు.