
YOGAMRUTAM
₹150
In stock · 2 available
PublisherDR.P.SUDARSHAN REDDY
LanguageTelugu
యోగామృతం ప్రాణాయామములు "ప్రాణాయమేమన యుక్తేన సర్వరోగక్షయే భవత్" - ప్రాణశక్తిని నిలపించడము. రాళ్ళల్లో వజ్రం ఎంత విలువైనదో ఆసనాలల్లో అంత విలువైనది వజ్రాసనం. ఎప్పుడైనా వేయవచ్చును. అన్ని ప్రాణాయామములు వజ్రాసనముతోనే చేయాలి. నాలుకను పై పళ్ళ చిగురుకు ఆన్చి, నోరు, కళ్ళు మూసుకొని ముక్కును చిట్లించి చేయు స్థితి, ఆసన స్థితి, విశ్రాంతి స్థితులను పాటించాలి. అందరూ చేయవచ్చును. ఎవరి శరీర స్థితిని తగ్గట్టు చేసుకోవలసి ఉంటుంది. దీర్ఘశ్వాస ప్రాణాయామములు 1. అబ్జామినల్ ప్రాణాయామము: మొదటగా గాలి గొట్టాల్లో ఉండే గాలి వదిలి, డొక్క భాగము మాత్రమే కదలికలతో చేయాలి. దీనివలన డయాఫామ్ కండరం సంకోచ, వ్యాకోచాలు చెంది లంగ్స్ కెపాసిటీ పెరుగును. ఛాతికి, పొట్టకు సాయపడును. 2. కపాలబాతి ప్రాణాయామము: మొదటగా గాలి గొట్టాల్లో ఉండే గాలి వదిలి, తల కదలికలతో మధ్యమంగా చేయాలి. చివరిలో 2,3 శ్వాసలు నెమ్మదిగా చేసి ఆపాలి. శరీరాకృతి ఏర్పడును. 3. సూర్యనాడి ప్రాణాయామము కుడి ముక్కుతో వేడి గాలి లోపలికి వెలుతుంది. చూపుడు వ్రేళ్ళను నుదుటి భాగమున ఉంచి, ఉంగరము వ్రేలుతో ఎడమ ముక్కును మూసి, కుడి ముక్కుతోనే గాలి గొట్టాల్లోని గాలిని వదిలి, మధ్యమంగా గాలిని తీసుకొనవలెను. 4. చంద్రనాడి ప్రాణాయామము ఎడమ ముక్కుతో చల్లని గాలి లోపలికి వెలుతుంది. చూపుడు వ్రేళ్ళను నుదుటి భాగమున ఉంచి, బ్రొటన వ్రేలుతో కుడి ముక్కును మూసి, ఎడమ ముక్కుతోనే గాలి గొట్టాల్లోని గాలిని వదిలి, మధ్యమంగా గాలిని తీసుకొనవలెను. 5. భస్త్రిక ప్రాణాయామము : చూపుడు వ్రేళ్ళను సుదుటి భాగమున ఉంచి, ఉంగరం వ్రేలుతో ఎడమ ముక్కును మూసి, కుడి ముక్కుతో గాలి గొట్టాల్లోని గాలిని వదిలి, క్రింది నుంచి పైకి కుడి ముక్కుతోనే గాలి పీల్చి పైన బ్రొటన వ్రేలుతో ముక్కును మార్చి ఎడమ ముక్కుతోనే గాలిని వదలాలి. క్రింద ముక్కును మార్చకూడదు.