YOGIKA SURYA NAMASKARALU by GOTTI MUKKALA MURALIKRISHNA Telugu book cover

YOGIKA SURYA NAMASKARALU

by GOTTI MUKKALA MURALIKRISHNA

₹36
In stock · 7 available
PublisherGOTTI MUKKALA MURALIKRISHNA
LanguageTelugu
యోగిక సూర్యనమస్కారాలు సూర్య నమస్కారాల ప్రాముఖ్యత సూర్యుని వల్ల సమస్త ప్రాణికోటి చైతన్యవంతమవుతుంది. సూర్యుని వల్ల సమస్త జీవరాశులు శక్తిని, చైతన్యాన్ని, క్రమశిక్షణను పొందుతున్నాయి. సూర్యోదయం ఒక జీవం, ఒక ఆశ, ఒక ఆరోగ్య ప్రదమైన ప్రక్రియ. సూర్యుడు క్రమశిక్షణకు మారుపేరు. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం, నాగరికత తెలిసినప్పటి నుండి మనిషి మొట్టమొదటి సారిగా అత్యంత శక్తివంతమైన దేవునిగా కొలిచినది సూర్యుడినే, ఎందుకంటే కాలచక్రాన్ని నడిపించేది సూర్యభగవానుడే. సూర్యుని వల్లనే పర్యావరణ సమతుల్యం జరుగుతుంది. మేఘాల గమనానికి, ఋతుపవనాలు ఏర్పడ్డానికి, వర్షాలు పడడానికి మూలాధారం ఆ సూర్యుని శక్తే. సూర్యరశ్మి వల్ల వృక్షాలు పెరిగి కిరణ జన్య సంయోగ క్రియ జరుపుకొని, ఆహారాన్ని తయారు చేసి సమస్త ప్రాణి కోటికి ఆహారాన్నిస్తున్నాయి. అలాంటి సూర్యకిరణాలతోటే మన శరీరాల్లో డి విటమిన్ తయారవుతుందని శాస్త్రీయ నిజం. మన శరీరంలోని రుగ్మతలను దూరం చేసి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి. సూర్యోదయం మనలో ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. వేదకాలం నుండి సంధ్యా వందనము ద్వార మన పూర్వీకులు సూర్యనమస్కారాలను క్రమం తప్పకుండా ఆచరించి ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలిగారు. మన ఆధునిక జీవన విధానం వల్ల ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే బి.పి, షుగరు, థైరాయిడ్, స్థూల కాయం లాంటి ఎన్నో వ్యాధులొస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన సూర్యనమస్కారాలను ఆచరించడము, | ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యవంతులవుదాము.