
YOU ARE FIRED
₹80
In stock · 6 available
PublisherOM PUBLICATIONS
LanguageTelugu
YOU ARE FIRED... ఈ పుస్తకం ఎందుకు వ్రాసామంటే... ఆర్ధిక వ్యవహారాల మీద, స్టాక్ మార్కెట్ మీద పుస్తకాలు వ్రాయటానికి మేము ఎకనమిక్స్, కామర్స్ సబ్జెక్ట్లో నిష్ణాతులం కాదు. ఫిక్షన్, పర్సనాలిటీ' డెవలప్మెంట్ రచయితలుగా మాకు పాఠకులలో మంచి పేరు, గుర్తింపు ఉంది. మేము గతంలో వ్రాసి పదే పదే రీఎడిషన్స్ వేసిన పుస్తకాల అమ్మకాలు పాఠకుల ఆదరణను ఋజువు చేస్తున్నాయి. మరి ఈ పుస్తకం ఎందుకు వ్రాసినట్లు? ఇది కూడా ఓ విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకమే... ఎందుకంటే' వ్యక్తిత్వ వికాసం' ద్వారా విజయాలను సాధించి, విజయాల ద్వారా డబ్బు, సక్సెస్ను స్వంతం చేసుకుని ఆనందంగా జీవించటమే వ్యక్తిత్వ వికాస పుస్తకాల లక్ష్యం. 'ఆత్మసంతృప్తే అల్టిమేట్ ' అని మేము చెబుతున్నాం... అది వేరే సంగతి... 'మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే...' అన్నాడు ఓ మేధావి. నిజమే కానీ మానవ సంబంధాలు ఇంత ఆర్థికంగా, కమర్షియల్గా, కృత్రిమంగా, బాధాకరంగా పరిణామం చెందటం అనేది గ్లోబలైజేషన్ తర్వాతే జరిగింది. ప్రపంచీకరణను మేము వ్యతిరేకించటం లేదు కానీ దాని పరిణామాలు మానవ సంబంధాలను, సున్నితమైన భావోద్వేగాలు, అనుభూతులు, పరిమళాన్ని ఏవిధంగా ' అనకొండ ' లాగా మ్రింగేసిందో చెప్పటమే రచయితలుగా మా ఆవేదన, మా లక్ష్యం... డబ్బు సంపాదించి సుఖపడాలని అందరికీ ఉంటుంది. అందులో తప్పేమీ లేదు ఆదెళ్ళ శివకుమార్