YUDDAM STREE PRAKRUTHIKI VIRUDDAM by S.ALEXIEVICH Telugu book cover

YUDDAM STREE PRAKRUTHIKI VIRUDDAM

by S.ALEXIEVICH

₹100
In stock · 4 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076091
ముందుమాట యుద్ధాన్ని ద్వేషించిన యుద్ధ వీరులు చాలా కాలంగా ఈ పుస్తకం నా దగ్గరున్నప్పటికీ చదవటం మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. "యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం" అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్న ఈ పుస్తకం శీర్షికను చూడగానే విసుగ్గా తోచేది. స్త్రీలు కనుక అత్యధిక సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చేస్తే మన దేశంలోని పార్లమెంటరీ రాజకీయాలు ప్రక్షాళనమై పోతాయనీ వాళ్ళు 'మాతృహృదయం'తో పరిపాలన చేస్తారనీ, చీపురుతో దుమ్ము దులిపినట్టూ శుభ్రంగా గిన్నెలు తోమినట్టూ అవినీతిని కడిగి పారేస్తారనీ 90లలో కొందరు తెలుగు స్త్రీవాద మేధావులు రాయడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ('స్త్రీలు పుట్టరు తయారు చెయ్యబడుతారు' అనే విషయాన్ని అంతకు పూర్వం వీళ్ళే చక్కగా వివరించి చెబుతుండేవాళ్ళు) ఆ తరవాత ఇదే మొదటు సిద్ధాంతాన్ని కులానికీ, ప్రాంతానికీ అన్వయించబోయి, చివరికి హాస్యాస్పదంగా మారిన అవకాశవాదాలూ ముందుకొచ్చాయి. ఇవన్నీ కలిగించిన చిరాకు కూడా ఈ పుస్తకం మీద అనాసక్తిగా మారిందనుకుంటా. ఇప్పుడు - అక్టోబర్ విప్లవం జరిగి వంద సంవత్సరాలయిన సందర్భంగా మలుపు ప్రచురణలు, ఈ పుస్తకాన్ని పునర్ముద్రిస్తోంది. దానికి పరిచయ వాక్యాలు రాయటానికని ఇప్పటికి దీన్ని చదివాను. రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసిన కొందరు సోవియట్ మహిళలు, బైలో రష్యాకు చెందిన అలెక్సీయెవిచ్ స్వెత్లానా అనే రచయిత్రికి స్వయంగా విన్పించిన తమ అనుభవాల గాథలివి. ఆ స్త్రీల మూటల్ని చదివాక కూడా జెండర్ అవగాహనకు సంబంధించిన విషయాల్లో ఈ పుస్తకంపై నాకు కొన్ని అభ్యంతరాలు మిగిలే ఉన్నాయి. కానీ ఈ పుస్తకానికి దానివే అయిన కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా ఒక యుద్ధ చరిత్రను రికార్డు చెయ్యటంలో ఈ రచయిత్రి అనుసరించిన పద్దతీ, ఈనాటికీ మన చుట్టూ అల్లుకుని ఉన్న కొన్ని భ్రమల తాలూకు భావనలను ఈ స్త్రీలు ఎంతో విభిన్నంగా, స్పష్టంగా నిర్వచించిన