YUDDHANIKI ADUGULU VEDDAM by S.SARATH JYOTHSNA RANI Telugu book cover

YUDDHANIKI ADUGULU VEDDAM

by S.SARATH JYOTHSNA RANI

₹100
In stock · 45 available
PublisherS.SARATH JYOTHSNA RANI
LanguageTelugu
yuddhaniki adugulu vēddām ఆచార్య శరత్ జ్యోత్స్నారాణిగారు 'యుద్ధానికి అడుగులు వేద్దాం’ అనే పేరుతో రచించిన ఈ కరోనా దీర్ఘకవిత ఒక ప్రత్యేకతను కలిగినది. కరోనా గురించి కవితలు రాసే మిగతావారంతా కరోనా వల్ల జరుగుతున్న కష్టాలను ఏకరువు పెడుతున్నారు. దానివల్ల ప్రజలకు, ప్రభుత్వానికి జరిగే నష్టాలను అంచనా వేస్తున్నారు. మరికొందరు కరోనాను శపిస్తున్నారు. ఇంకొందరు మనిషికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. కొందరైతే కరోనా వల్ల నేర్చుకున్న గుణపాఠాలను, దానివల్ల కలిగిన లాభాలను ఉటంకిస్తున్నారు. కానీ ఆచార్య శరత్ జ్యోత్స్నారాణిగారి కవిత్వంపై వాటికి భిన్నంగా, ఇదివరకు ఎవరూ స్పృశించని రీతిలో నడిచింది. ఆమె స్త్రీ సహజమైన సౌకుమార్యంతో, సున్నితంగా కరోనాను ఉద్దేశించి ఒక హితోపదేశం, ఒక గీతోపదేశం చేసినట్లు ఈ కవిత కొనసాగింది. - ఆచార్య టి. గౌరీశంకర్