
YUDDHAVACHANAM
₹180
In stock · 126 available
PublisherADUGUJADALU PUBLICATIONS
LanguageTelugu
yuddhavachanam by juluru gowri shankar అక్షరాల్ని ఎక్కుపెట్టిన అస్త్రాలుగా, పదాల్ని పదును తీర్చిన శస్త్రాలుగా, వాక్యాల్ని లక్ష్యం వైపు దూసుకుపోయే వార్ హెడ్స్ గా మలచిన విశిష్టమైన విద్య వొకటి గౌరీశంకర్ వచనంలో మనకు గోచరిస్తుంది. కవిత్వశైలి జోడించడంవల్ల జూలూరు వచనం పొక్కిలైన వాకిట సానుపు చల్లినట్టుంటుంది. నిండిన చెరువు అలుగు పారినట్టుంటుంది. మత్తడి దుంకుతున్నట్టుంటుంది. వొడ్డుల్ని కూల్చుకొంటూ పోయే నదీప్రవాహంలా సాగుతుందతని వచనం. ఉద్యమావేశంతో వేసే ఒక పోరుకేక ఒక యుద్ధాక్రందన (War - Cry) జూలూరి వచనం. అందుకే వొక జలపాతపు హోరునీ, వొక సాగర ఘోషనీ అతని వచనంలో వినగలం. తెలంగాణా నేలతరతరాలదాస్య శృంఖలాలను తెంచుకుంటున్న సవ్వడిని యీ వ్యాసాలకు నేపథ్య సంగీతంగా కూర్చాడు గౌరీశంకర్.