
YUGA PURUSHULU
₹80
In stock · 2 available
PublisherAAREKATIKE NAGESWARARAO
LanguageTelugu
యుగపురుషులు నెల్లుట్ల సునీత కలం పేరు శ్రీరామ సాహితీ బృందావన విహార వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఉమెన్స్ రైటర్స్ నేషనల్ అసోసియేషన్ చైర్ పర్సన్, సున్నితం రూపకర్త, వచన కవిత్వంలో అస్పష్టత ఎక్కువ కావడం వల్ల దాన్ని తగ్గించడానికి మిని కవిత్వం ఆవిర్భవించింది. 1978-1985 ల మధ్య ఈ కవిత్వం యువకుల్ని ఎక్కువగా ఆకర్షించింది. అద్దె పల్లి గారి అభిప్రాయం ప్రకారం వచన కవితా యవన రూపా "మినీ కవిత" వచన కవితకు సంక్షిప్త రూపమే మినీ కవిత అంటారు. టి. ఎల్ .కాంతారావు, తక్కువ మాటలలో ఎక్కువ భావాన్ని కూర్చడమే దాని ప్రత్యేకత. హైకూలు, ముత్యాలసరాలు, నానీలు, మినీకవిత రూపాలు.ఆధునిక కవిత్వ ప్రక్రియలో మరో కొత్త రూపం బీసీ కవిత్వం. "వెంటాడే కలాలు" దీనికి ఉదాహరణ. ఈ విధంగా తెలుగు సాహిత్యం వెయ్యేళ్ల కాలంలో శాఖోపశాఖలుగా విస్తరిల్లింది శోభిల్లుతోంది. ఆంగ్లభాషా సాహిత్యాల ప్రభావం బాగా పండింది. దానితో ఆంధ్ర సాహిత్యంలో నూతనత్వం సంతరించుకుంది. ఆంగ్ల విద్యావిధానం వల్ల నూతన సంప్రదాయాలు, నవీన మార్గాలు, అనుసరిస్తూ రచనలు వెలువడ్డాయి. వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, నూతన ప్రక్రియలకు జీవం పోశారు. విశ్వ వేదికపై నిలిచిన యుగపురుషులు ఈ సున్నితాలు నాకు తెలుగు భాష పైన మక్కువతో తెలుగు భాషాభివృద్ధికి, పరిరక్షణ చేసి విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షతో.. సాహిత్యాన్ని సులభతరం చేసి సామాన్యులు కూడా రాయగలిగేలా ఉండాలని భావించి, కవులను, విద్యార్థులను, ప్రోత్సహిస్తూ ఈ ప్రక్రియను రూపొందించాను.