
YURI ALEKSEYEVICH GAGARIN (ANTHARIKSHAM NUNDI BHUGOLAM CHUSINA MODATI MANAVUDU)- 45.00
₹45
In stock · 727 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
చరిత్ర సృష్టించిన చరితార్థుడు యూరీ అలెక్సే యెవిచ్ గగారిన్ ఆకాశం అద్భుతాలకు నిలయం.. పగలుసూర్యుడు ఉంటాడు. రాత్రి నక్షత్రాలు వస్తాయి. పెరుగుతూ, తరుగుతూ చంద్రుడు వస్తాడు. అప్పుడప్పుడూ తోకచుక్కలు కనిపిస్తాయి. ఇవి అన్నీ ప్రాచీన మానవులను ఆశ్చర్యపరిచాయి. క్రమక్రమంగా విజ్ఞానం వికాసం చెందుతూ ఆకాశంలోని వింతలు గురించి అవగాహన కలిగించింది. ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి. వాటిలాగా ఎగిరి పోవాలని ప్రయత్నాలుచేశారు. మొదట వేడి గాలి గమ్మటాలు ఆకాశంలో ప్రయాణించటానికి దారిచూపించాయి. తరువాత విమానాలు వచ్చాయి. భూమినుండి 7 మైళ్ల ఎత్తు వరకే ఇవి ప్రయాణం చేయగలుగుతాయి. ఆకాశంలో గాలిలేనిచోటుఉన్నది. అక్కడ ప్రయాణించటానికి ప్రత్యేకమైన సాధనాలు కావాలి. దానికోసం రాకెట్లు రూపుదిద్దుకున్నాయి. ఇవి గాలిలేని ప్రదేశాలలోకూడా ప్రయాణించగలుగుతాయి. వీటితో ఆకాశం చాలావరకు అందుబాటులోకి వచ్చింది. భూమినుండి చాలాఎత్తు పోయిన తరువాత అంతరిక్షం ఉన్నది. దీనినే రోదసి అనికూడా అంటారు. అంతరిక్షాన్ని అందుకోవాలని, దానిలో ప్రయాణం చేయాలనీ ఆకాంక్ష పెరగింది. దానికోసం కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్షనౌకలు అవతరించాయి. ఇక అంతరిక్షంలోకి మానవులను పంపే కార్యక్రమం మొదలయ్యింది. వోస్టాక్ అనే అంతరిక్షనౌకలో రాకెట్టు సహాయంతో, అంతరిక్షంలో