
YUVAKULAKU VIVEKANANDUNI PILUPU
₹15
In stock · 37 available
PublisherRAMAKRISHNA MATH
LanguageTelugu
ISBN9789383972616
1. కర్తవ్యం యువకులారా! నా ఆశలన్నీ మీ పైనే ఉన్నాయి. మీ జాతి పిలుపుకు మీరు స్పందిస్తారా? నా మాటను విశ్వసించే సాహసం మీకు ఉంటే మీలో ప్రతి ఒక్కరికీ ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది. బాల్యంలో నాపట్ల నాకు ఎలాంటి విశ్వాసం ఉండేదో అట్టి అఖండ విశ్వాసం మీ పట్ల మీకు ఉండాలి. మీలో ప్రతి ఒక్కరూ అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. ప్రతి ఆత్మలోనూ నిక్షిప్తమై ఉన్న ఆ అనంతశక్తిచేత మీరు యావద్భారత దేశాన్ని పునరుజ్జీవింప చేయగలరు. ఆహా! అప్పుడు మనం ఆకాశం క్రింద ఉన్న దేశాలన్నింటిలోకి చొచ్చుకొని పోతాం. అచిరకాలంలోనే ప్రపంచంలోని ప్రతి జాతిని నిర్మిస్తూ ఉన్న అనేక శక్తులలో మన భావసముదాయం కూడా ఒక ముఖ్యాంశమై పోతుంది. భారతదేశంలోను, విదేశాలలోను ప్రతి జాతీయ జీవనంలోను మనం అంతర్లీనం కావాలి. దీని సాధనకై మనం ఉద్యమించవలసి ఉంది. ఈ కార్యనిర్వహణలో నాకు యువకులు కావలసి ఉన్నారు. దృఢసంకల్పం కలవాడు, బలిష్ఠుడు, కుశాగ్రబుద్ధి కలిగిన యువకుడే పరమాత్మను చేరగలడని వేదాలు పేర్కొంటున్నాయి. మీ భవిష్యత్తును నిర్ణయించుకోవలసిన సమయం ఇదే. స్వచ్ఛమైన, ఉజ్జ్వలమైన పొంగే యువశక్తి మీలో ఉన్నప్పుడే మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాలి. జవసత్త్వాలు ఉడిగిన పిదప కాదు. లేవండి, సమయం ఇదే. తాజా, అనాఘ్రాత కుసుమాలను మాత్రమే భగవత్పాదార విందాలకు అర్పించాలి. అట్టి వాటినే ఆయన బహుప్రీతితో స్వీకరిస్తాడు. జీవితం మూడునాళ్ళ ముచ్చట; కనుక అలసత్వంనుంచి మేలుకోండి. న్యాయవాదో మరొకటో కావాలని ఆకాంక్షించటం కంటే మీరు చేయగల ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి.