
YUVATHA BHAVITHA - 70
₹70
In stock · 60 available
PublisherCHIVUKULA RAMAKANTHA SARMA
LanguageTelugu
నా మాట ... మీ భవిష్యత్తుకు చక్కని బాట నిర్మించటానికి సిద్ధపడుతున్నారా? అయితే అందుకు సిద్ధంకావాలి. “ఆలస్యం అమృతం విషం” అన్నారు పెద్దలు. వాయిదాలు వేయకండి, సోమరితన్నాన్ని విడనాడండి. సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి. మనస్సు నియంత్రించి ఆలోచనాశక్తిని పెంచుకోండి. అప్పుడు విజయం మీదే. భారత, భాగవత, రామాయణంలోని ప్రధాన పాత్రధారులంతా ఎన్నో కష్టాలు అనుభవించారు. వారంతా పట్టుదల, త్యాగం, ధర్మం, సత్యం, ఎకాగ్రత, సానుకూల దృక్పధం, ఆత్మవిశ్వాసం, మృదువైనమాట, అకుంఠిత దీక్ష, మానసికబలం, ధైర్యసాహసాలు, తల్లిదండ్రులు, గురువుల హితబోధ, ఆశీస్సులతో అధ్యాత్మిక శక్తిని జోడించి విజయం సాధించినవారే. వీరందరికీ ఎంతోమంది సహాయ సహకారం అందించారు. మంచివారికీ, మంచిపనికీ, మంచి మనస్సుతో అందరూ సహకరిస్తారు. పాండవులు అరణ్యవాస, అజ్ఞాతవాస సమయంలో ఎన్నో కష్టాలు అనుభవించి చివరకు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు గదా! రామాయణంలో తండ్రి దశరధుని మాటవిని పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాస సమయంలో శ్రీరాముడు సీతా సమేతంగా అనుభవించిన కష్టాలెన్నో మనందరికి తెలుసు. రామరావణ యుద్ధంలో శ్రీరాముడు విజయాన్ని వరించటం అందరం కథలుగా చదువుకున్నాం. ప్రాచీనకాలం నుంచి నేటివరకు మహాపురుషులంతా బాల్యం నుంచే తల్లితండ్రుల దగ్గర, గురువుల దగ్గర శిక్షణపొంది, స్వయంప్రేరణ, చొరవ, అనుభవంతో కష్టాలను అధిగమించి విజయం సాధించారు. అందుకే వారి చరిత్రలను పుస్తకాలలో చదవటం, కథల ద్వారా వినటం, సినిమాల ద్వారా చూడటం ఈనాటికీ అలవాటుగా వస్తూనే ఉంది. ఆ మహాపురుషులు విజయాలే ఈనాటి యువతకు మార్గదర్శకం.