YUVATHA SHUDDHI UDHYAMALU by PROF.D.M.RAVI PRASAD Telugu book cover

YUVATHA SHUDDHI UDHYAMALU

by PROF.D.M.RAVI PRASAD

₹80
In stock · 43 available
PublisherPROF.D.M.RAVI PRASAD
LanguageTelugu
ముందు మాట జీవితంలో యువదశ చాలా ప్రధానమైనది. బాల్యం నుండి యౌవ్వనం వరకు విద్యా విషయాలను తెల్సుకొని జ్ఞానంను పొంది మంచి చెడులను గ్రహించి ప్రతి యువకుడు తమ దశ దిశలను నిర్ణయించుకోవల్సియుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకొని సంకల్పబలంతో యువత ముందుకు పోయినట్లైయితే తమకు సమజానికి ఉపయోగపడ్తారు లేని యెడల అక్రమమార్గంలో బ్రతుకుతూ సక్రమమైన జీవనంలేక శ్రీశ్రీ చెప్పినట్లుగా సంధులలో పందులవలె మీదీ ఒక బ్రతుకేనా! అన్నట్లుగా గడుస్తుంది. కనుక, యువత మంచి అవగాహనతో వర్తమానంలో వారి బంగారం లాంటి భవిష్యత్తుకై చక్కని మార్గాల్ని ఎన్నుకోవల్సియుంటుంది. యువత అనగా శారీరకంగా మానసికంగా శక్తిని కలిగి అన్యాయాలను ఎదిరించడానికి ఎంతవరకైనా సాహసం చేయగల వయస్సు. ఈ వయస్సుతో ఉత్తేజమైన మనస్సుతో జీవించిన యెడల వాస్తవానికి దరిద్రం కూడా దగ్గరకి రాదు. ఈనాడు మానసిక మరియు తమ శక్తి యుక్తులను సరిగా ఉపయోగించకపోవడం వలన దరిద్రం పెరిగి పెద్దదౌతున్నది. కనుక, ప్రక్షాళన అనేది యువత నుంచి మొదలుకావాలి. అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది. యువత కులాలకు, మతాలకు అవినీతికి అలవాటై కపటులుగా బ్రతికితే వారిలాగా వారి సమాజం కూడా పెరుగుతుంది. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు ఎలా బ్రతికారో పిల్లలు వారిలాగే బ్రతకాలని ఆలోచిస్తున్నారు. కాని అది అసాధ్యం. అందువలన లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మాట్లాడుతూ కపటంలో కఠినంగా బ్రతుకుతున్నాడు. కనుక యువత వాస్తవాలను గ్రహించి అనగా నిజాలు నిప్పులా ఉంటాయని తెల్సుకొని, కల్పింపబడిన, మోసపూరితమైన విషయాలకు దూరంగా ఉండి 'సత్యంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలి. ఈనాడు అధికారంలో ఉన్నవారు, రాజకీయాలలో ఉన్నవారు అవినీతికి పాల్పడేవారు. అక్రమ సంపాదనతో అనేక బాధలు పడుతున్నవారు. ఒకప్పుడు తప్పులు చేసి తప్పించుకు తిరిగేవారు లేదా దొరికితే తలదించుకు బ్రతికేవారు. కాని ఈనాడు పరిస్థితి వేరుగా ఉంది. తప్పులు చేసినవారు సిగ్గులేకుండా బ్రతుకుతున్నారు. ఎందుకనగా, ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానం వలన ఎవరూ తప్పించుకొనే పరిస్థితిలేదు.