YUVATHARAMA MELUKO by NARESH INDIAN Telugu book cover

YUVATHARAMA MELUKO

by NARESH INDIAN

₹70
In stock · 39 available
PublisherNARESH INDIAN
LanguageTelugu
ముందుమాట ఒక రెండు సంవత్సరాల క్రితం లీడ్ ఇండియా టీ-షర్ట్ వేసుకున్న నరేష్ ని నేను కలవటం జరిగింది. అతనిలో ఏదో చెయ్యాలనే తపన, ఈ దేశానికి మంచి చేయాలన్న దృఢమైన సంకల్పం ఉన్న మనిషి చూశాను. తనని చూసినప్పుడు స్వామి వివేకానంద చెప్పిన వాక్యాలు నాకు గుర్తుకువచ్చాయి. "నిన్ను బలహానుడవని నీవు ఊహించుకుంటే నీవు నిజంగా బలహీనుడుగానే మిగులుతావు. కాని అదే శక్తివంతుడవని, బలవంతుడవని నీవు అనుకుంటే ఖచ్చితంగా నీవు శక్తివంతమైన మనిషిగా తయారవుతావు". నరేష్ రెండవ కోవకు చెందిన మనిషిగా నాకు ఆ రోజే అనిపించింది. అతనితో నాకు సాన్నిహిత్యం చెయ్యాలనిపించింది. మారీగోల్డ్ హోటల్లో జరిగిన లీడ్ ఇండియా ప్రోగ్రామ్ లో నరేష్ తాను రాజకీయాల్లోకి వచ్చి ఒక మంచి నాయకుడుని అవుతానని చెప్పడం జరిగింది అతనికి మనస్ఫూర్తిగా నా శుభాశీస్సులు. ఒయాసిస్ స్కూల్ లో మా శ్రీశైలం ప్రాజెక్టు స్కూల్ పిల్లలకు "ఉల్లాస వేసవి" వ్యక్తిత్వ వికాస శిక్షణ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఎంతో ఎదిగి తన లక్ష్యం దిశగా చక చకా అడుగులు వేస్తున్న నరేష్ ను చూశాను. ఎంతో శ్రమతో తను 'యువతరమా మేలుకో అన్న శీర్షికతో యువతరానికి మార్గదర్శకులుగా అవ్వడానికి ఏం చెయ్యాలి? అని యువతకు అవసరమైన విషయాలను అర్థవంతంగా చదువుతున్నప్పుడే వారిలో ఉత్తేజం కలిగేలా వ్రాసిన సంకలనానికి ముందు మాట వ్రాయమని నన్ను కోరటం జరిగింది. వెంటనే ఎంతో ఉత్సాహంగా ఆ సంకలనాన్ని చదవటం మొదలుపెట్టా క్యాంప్ నుండి ఆఫీసు వెళ్తూ, ఆఫీస్ నుండి క్యాంప్కు వస్తున్న సమయంలో నేను ఆ పుస్తకం చదవటం ఈ “యువతరమా మేలుకో” లో నరేష్ మనకు తెలిసిన విషయాలనే ఎంతో అద్భుతంగా మనసుకు హత్తుకునేలా యువతరానికి వారి కర్తవ్యాలను గుర్తు చేస్తూ వారి జీవితాన్ని "ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి" ఎలా తీసుకెళ్ళాలో "భగవద్గీతలో భగవానుడు అర్జునునికి" చెప్పిన రీతిలో నరేష్ మనకు చెప్పడం జరిగింది. అబ్దుల్ కలాంగారి కల అంటే 2020 సంవత్సరానికి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలి దానికి దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న యువతరమే దశ, దిశ నిర్దేశించగల వాళ్ళు. అలాంటి యువతరానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని నా నమ్మకం.