
ZALZALA
by SKY BAABA
₹100
In stock · 2 available
PublisherSKY BAABA
LanguageTelugu
ఒక భూకంపం మళ్ళీ మీ ముందుకు... 'జలలా'! తెలుగు సాహిత్యంలో ఒక భూకంపం.. ఒక సంచలనం.. ఒక మైలురాయి. అట్టడుగు.. చిట్ట చివరి బాధితుడి ఆక్రందన.. దిక్కులు పిక్కటిల్లే అరుపు.. ఆవాజ్.. పుకార్! 'జలలా' ముస్లింవాద తొలి సాధికార సంకలనం. స్వచ్ఛమైన కంఠం. ఏ భేషజాలు, భయాలు లేకుండా పలికిన స్వరం. ఇందులో ఎక్కడా తొట్రుపాటు లేదు. జంకు గొంకు లేదు. స్వచ్ఛంగా సూటిగా ఉన్నది ఉన్నట్లుగా పలకడమే ఈ సంకలనం ప్రత్యేకత. 1998లో వచ్చిన ఈ సంకలనం తెలుగు సాహిత్యానికి షాక్ ఇచ్చింది.. అతలాకుతలం చేసింది. పర్సెంటేజీల్లో తేడాతో 'హిందూ జాడ్యం' వదలని చైతన్యవంతుల్లోనూ ఒక ప్రకంపన పుట్టించింది. ఒక లోతైన ఆలోచన కలిగించింది. ముస్లింల దృష్టికోణం నుంచి సమాజాన్ని చూసే చూపునిచ్చింది. ముస్లింవాదానికి గట్టి పునాది వేసింది. స్త్రీవాదులకు 'నీలిమేఘాలు', దళితవాదులకు 'చిక్కనవుతున్నపాట'ల్లాగే ముస్లింవాదులకు 'జలలా' తొలి స్వచ్ఛమైన బలమైన అడుగు అయ్యింది. అంతర్ బాహిర్ పోరాట కోణాల్లోంచి చూస్తే ఆ రెండు సంకలనాల కన్నా రెండడుగులు ముందుకేసింది. ఈ సంకలనం రాకముందు ముస్లింవాదానికి సరైన దిక్కు దిశ లేకుండె. పొందికైన నిర్వచనం లేకుండె. రకరకాల సందిగ్ధాలు సందేహాలు భయాలు ఆందోళన కమ్మి ఉండే. ముస్లిమ్ గట్టిగా మాట్లాడడానిక్కూడా జంకుతున్న కాలం. అలాంటి స్థితిలో ముస్లిం అస్తిత్వ పోరాట గొంతుకతో చాలా స్పష్టంగా నిక్కచ్చిగా పలికింది ఈ సంకలనం. ముస్లింవాదానికి వాద నామాన్ని, వాదాన్ని నిర్వచించుకునే వెసులుబాటును అందించింది. ముస్లింవాదంలో ప్రతిబింబించాల్సిన అన్ని కోణాలనూ పొదువుకొని వెలువడింది. సందిగ్ధ, సందేహ జీవులకు ఒక దిశానిర్దేశం చేసింది. కుడి ఎడమలే కాక సొంత సమూహంలోని లొసుగులన్నింటినీ కదిల్చి పారేసింది.